Wednesday, March 5, 2025

నావల్లే లాలూ రాజకీయాల్లో ఎదిగారు : నీతీశ్

- Advertisement -
- Advertisement -

పాట్నా : ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌పై బీహార్ సిఎం నీతీశ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతనిపై సీఎం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో బీహార్‌లో అభివృద్ధి ఏమీ జరగలేదని, తన హయాంలోనే జరిగిందన్నారు. ఈ సందర్భంగా తన వల్లే లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో ఎదిగారని, వ్యాఖ్యానించారు. “ గతంలో బీహార్‌లో పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుందా ? సాయంత్రం అయ్యిందంటే ఎవ్వరూ బయటకు వచ్చేవారు కాదు. నీవు చిన్నపిల్లాడివి. వెళ్లి ప్రజలను అడుగు. మీ నాన్న ఈ స్థాయిలో ఉన్నాడంటే అది నావల్లే. లాలూకు ఎందుకు అండగా నిలుస్తున్నారని మీ సొంత మనుషులే అడిగారు.

అయినప్పటికీ మద్దతు ఇచ్చా.” అని నీతీశ్ కుమార్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మాట్లాడిన తేజస్వియాదవ్, రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడారు. ఆదాయం లేనప్పటికీ బడ్జెట్ పెరుగుతూ పోతుండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను అబద్ధాల పుట్ట అని ఆరోపించారు. తన తండ్రి లాలూ ప్రసాద్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వంలో మాత్రం అన్నీ తప్పుడు లెక్కలేనని, విమర్శించారు. ముఖ్యమంత్రి నీతీశ్ అసెంబ్లీలో ప్రసంగిస్తున్న సమయంలో తేజస్వీ అడ్డుకునే ప్రయత్నం చేయగా, తేజస్వీపై సీఎం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News