Wednesday, March 5, 2025

నిర్ధారిత దోషులైన రాజకీయ నేతల అనర్హత తగ్గింపుపై వివరాలు ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిర్ధారితులైన రాజకీయ నేతల పేర్లను వోటర్ల జాబితాల నుంచి అనర్హత కాలాన్ని తొలగించిన లేదా తగ్గించిన సందర్భాల వివరాలను సమర్పించవలసిందిగా భారత ఎన్నికల కమిషన్ (ఇసిఐ)ని సుప్రీం కోర్టు మంగళవారం కోరింది, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం (ఆర్‌పిఎ) సెక్షన్ 11 కింద తన అధికారాన్ని వినియోగించినటువంటి కేసుల వివరాలను రెండు వారాల్లోగా సమర్పించవలసిందని ఎన్నికల కమిషన్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు దీపంకర్ దత్తా, మన్మోహన్‌తో కూడిన ధర్మాసనం కోరింది. ఆర్‌పిఎ కింద క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిర్ధారితులైన తరువాత ఎన్నికల రాజకీయాల నుంచి అనర్హత వ్యవధి నేరం, శిక్ష ఆధారంగా మారుతుంటుంది.

రెండు, అంతకు మించిన సంవత్సరాల కారాగార శిక్షకు సంబంధించిన కేసుల్లో దోషిగా నిర్ధారితుడైన తేదీ నుంచి బెయిల్‌పై ఉన్నాన, లేదా అప్పీల్‌పై నిర్ణయం కోసం వేచి ఉన్నా జైలు నుంచి విడుదల అయిన తరువాత ఆరు సంవత్సరాల వరకు ఒక వ్యక్తిని అనర్హునిగా ప్రకటిస్తారు. అయితే, కారణాలను నమోదు చేసిన అనంతరం అనర్హత కాలాన్ని తొలగించడానికి లేదా తగ్గించడానికి ఆర్‌పిఎ 11 సెక్షన్ కింద ఇసిఐకి అధికారం ఉంది. ఇసి వివరాలను సమర్పించిన తరువాత రెండు వారాల్లోగా ఇసి సమాధానానికి స్పందనను పిల్ పిటిషనర్ అశ్వినీ ఉపాధ్యాయ్ ప్రభృతులు దాఖలు చేయవచ్చునని బెంచ్ సూచించింది.

న్యాయవాది అశ్వనీ దుబే ద్వారా దాఖలైన 2016 నాటి పిల్ దోషులుగా నిర్ధారితులైన రాజకీయ నేతలపై జీవితాంతం నిషేధం విధించాలని, దేశంలోని ఎంపిలు, ఎంఎల్‌ఎలపై క్రిమినల్ కేసులను త్వరితగతిని పరిష్కరించాలని కోరింది. ఎన్‌జిఒ లోక్ ప్రహారి దాఖలు చేసిన అటువంటి పిటిషన్ పెండింగ్‌లో ఉందని, మరొక బెంచ్ విచారిస్తున్నదని తెలియజేసిన మీదట ఉపాధ్యాయయ్ పిల్‌ను దానితో కలిసి ఒక కోర్టు ముందు విచారణకు జాబితాలో చేర్చేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సంజీవ్ ఖన్నాకు బెంచ్ నివేదించింది. సిజెఐ పరిపాలన ఉత్తర్వు జారీ చేసిన పిమ్మట ఈ పిటిషన్లను శీఘ్ర విచారణకు జాబితాలో చేర్చాలని బెంచ్ సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News