Wednesday, March 5, 2025

కశ్మీర్‌కు, ఆక్రమిత కశ్మీర్‌కు సాపత్యమా? : సిఎం ఒమర్ అబ్దుల్లా

- Advertisement -
- Advertisement -

జమ్ము: కశ్మీర్ విషయంలో అసెంబ్లీలో నేషనల్ కాన్ఫరెన్స్, బిజెపి శాసనసభ్యుల మధ్య గట్టి వాదోపవాదాలు జరిగాయి. దాని తర్వాత జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మన కశ్మీర్‌కు, ఆక్రమిత కశ్మీర్‌కు సాపత్యం లేదన్నారు. ఆవలి వైపున అంటే ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్‌కు చైనా సాయం చేస్తున్పప్పటికీ పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు. ‘మన కశ్మీర్‌లో ఎంతో అభివృద్ధి జరిగింది. మనం రోడ్ల నిర్మాణం కోసం చైనా, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ సాయం కోరలేదు’ అన్నారు. ‘ఆక్రమిత కశ్మీర్‌లో ఏదైనా అభివృద్ధి అంటూ జరిగిందంటే అది చైనా సాయంతోనే’ అని వివరించారు. ప్రశ్నోత్తర సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఎంఎల్‌ఏ సైఫుల్లా మీర్ ‘ఆవలి వైపున్న ఆక్రమిత కశ్మీర్ కన్నా మన అధీనంలో ఉన్న కశ్మీర్ మౌలికసదుపాయాల పరంగా ఎంతో మెరుగు.

కెరాన్ సరిహద్దు ప్రాంతం నుంచి కుప్వారా జిల్లాలోని జుమగుండ్ వరకు అన్ని వాతావరణాలకు అనువైన సొరంగం నిర్మించాం’ అన్నారు. కాగా కశ్మీర్ ఇరువైపుల పరిస్థితి ఆయన పోల్చడంపై బిజెపికి చెందిన శాసనసభ్యుడు ఆర్.ఎస్ పఠానియా ఆక్షేపణ తెలిపారు. అయితే ఎన్‌సి ఎంఎల్‌ఏలు నజీర్ గురేజీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ శాసనసభ్యుడు సజాద్ గనీ లోనే మీర్‌కు మద్దతుగా వచ్చారు. దాంతో బిజెపి, నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యల మధ్య రచ్చ రాజుకుంది. స్పీకర్ అబ్దుల్ రహీమ్ సభ కార్యకలాపాలను ప్రశాంతంగా కొనసాగనివ్వండి అని అభ్యర్థించారు. కానీ మీర్ వ్యాఖ్యలను బిజెపి సభ్యుడు ఫఠానియా విమర్శించారు.

‘ఏ దేశంతో మనకు దౌత్య సంబంధాలు బాగా లేవో ఆ దేశాన్ని మీర్ తెగ పొగిడారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడానికి మన దేశం మన జట్టును అక్కడికి పంపలేదు. భారత్‌లో వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నది ఆ దేశం. మీర వ్యాఖ్యలు ఆందోళనకరం, ఖండనీయం. దీనిపై ముఖ్యమంత్రి ఆయన పార్టీ వైఖరిపై స్పష్టీకరణ ఇవ్వాలి’ అన్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో బిజెపి సభ్యుడు శామ్ లాల్ శర్మ ప్రసంగిస్తుండగా సైఫుల్లా మీర్ లేచి నిలబడి తనని ‘ద్రోహి’ అనడంపై పఠానియాను నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News