- Advertisement -
దుబాయ్: టీం ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి సెమీఫైనల్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 265 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే గిల్, రోహిత్‌ల వికెట్‌లు కోల్పోయింది. ఈ దశలో కష్టాల్లో పడిన జట్టుకు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌ల జోడీ అండగా నిలిచింది. నిలకడగా బ్యాటింగ్ చేస్తూ.. ఆసీస్ బౌలర్ల నుంచి పరుగులు రాబడుతోంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 4 ఫోర్లతో వన్డేల్లో 74వ అర్థశతకాన్ని సాధించాడు. ప్రస్తుతం 26 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. క్రీజ్‌లో కోహ్లీ(51), అయ్యర్(45) ఉన్నారు.
- Advertisement -