Monday, April 28, 2025

తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత కలకలం

- Advertisement -
- Advertisement -

రెండేళ్ల కిందట తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో ఆరేళ్ల బాలికను చిరుతపులి చంపేసిన ఘటన తర్వాత కాలి నడకన కొండపైకి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరచుగా అలిపిరి నడక మార్గంలో చిరుత పులులు దర్శనమిస్తుం డడంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా, మరోసారి మెట్ల మార్గంలో చిరుత కలకలం రేగింది. అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో గాలి గోపురం వద్ద చిరుత పులి కనిపించింది. అది ఓ పిల్లిని వేటాడి అడవిలోకి తీసుకెళ్లింది. ఈ మేరకు సిసి కెమెరాల్లో రికార్డయింది. సోమవారం రాత్రి తిరుపతిలోని జూ పార్క్ రోడ్డులోనూ చిరుతపులి కనిపించినట్టు తెలిసింది. కాగా, టిటిడి రాత్రి 10 గంటల తర్వాత నడక మార్గాల్లో భక్తులను అనుమతించడం లేదు. అటు, 12 ఏళ్ల లోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల లోపే నడక మార్గంలో తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News