- Advertisement -
ప్రతిపక్షాల నిరసనలతో సెర్బియా పార్లమెంట్ అట్టుడుకింది. స్మోక్ బాంబులు, మండే స్వభావం కలిగిన ఇతర వస్తువులు విసరడంతో రణరంగంగా మారింది. వీటితోపాటు కోడిగుడ్లు, వాటర్ బాటిళ్లనూ చట్టసభ సభ్యులు విసురుకున్నట్టు సమాచారం. ఈ సంఘటనలో ముగ్గురు ఎంపీలకు గాయాలు కాగా, అందులో ఒకరి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. యూనివర్శిటీ విద్యకు నిధులు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరిగింది. దీనిపై ఓటింగ్ సమయంలో పార్లమెంట్‌లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతోపాటు అనేక నిర్ణయాలను ఆమోదించే యోచనలో అధికార పార్టీ ఉందని ప్రతిపక్షాలు నిరసన చేపట్టాయి. ప్రధాని మిలోస్ వుచెవిక్ రాజీనామాను వెంటనే ఆమోదించాలని విపక్షాలు డిమాండ్ చేశారు.
- Advertisement -