Wednesday, March 5, 2025

ఉక్రెయిన్‌కు సైనిక సాయం నిలిపివేత

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ ఇటీవల మీడియా ఎదుటే వాగ్వాదాని కి దిగడం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఈ నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాతో యుద్ధం సాగుతున్న పరిస్థితుల్లో ఉక్రెయిన్‌కు అందించే మిలిటరీ సాయాన్ని నిలిపివేసింది. అధ్యక్షుడు ట్రంప్ శాంతిస్థాపనపై దృష్టి సారించారు. మా భాగస్వాములు కూ డా ఆ లక్షానికి కట్టుబ డి ఉండాల్సిన అవసరం ఉంది. మేము మా సాయాన్ని నిలిపివేస్తున్నాం. ఇది ఒక పరిష్కారాన్ని చూపిస్తోంది ” అని వైట్‌హౌస్‌కు చెం దిన ఓ అధికారి వెల్లడించారు.

అయితే ఇది తాత్కాలికమేన ని వెల్లడించారు. రష్యాతో శాంతి చర్చలకు కీవ్‌పై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణ యం తీసుకున్నట్టు తెలుస్తోంది. లండన్‌లో ఐరోపా దేశాధినేతల సమావేశం తరువాత జెలెన్‌స్కీ అగ్రరాజ్యంతో ఖనిజాల ఒప్పందానికి తాము సిద్ధమేనని ప్రకటించారు. ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయా న్ని ఉక్రెయిన్ ప్రభుత్వం తీవ్రంగా ఖం డించింది. అగ్రరాజ్యం తమకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలు క్రమం గా తమ దేశాన్ని రష్యాకు లొంగిపోయేలా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నట్టు ఉన్నాయని ఆ దేశ పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల కమిటీ చీఫ్ మెరెజ్‌కో ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News