- Advertisement -
న్యూఢిల్లీ: ప్రముఖ శైవ క్షేత్రం కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కేదార్‌నాథ్‌లో రోప్‌వే నిర్మాణానికి కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినేట్ సమావేశంలో రూ.4,081 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకుప్ర గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సోన ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్ వరకూ 12.9 కిలో మీటర్ల వరకూ సాగే ఈ రోప్‌వే పూర్తైతే.. 8-9 గంటల పాటు సాగే ట్రెక్కింగ్ ప్రయాణాన్ని.. కేవలం 36 నిమిషాల్లో పూర్తి చేస్తుంది.
ప్రస్తుతం కేదార్‌నాథ్‌కి వెళ్లే భక్తులు గౌరీకుంఢ్ నుంచి కాలినడకన, గుర్రాలపై లేదా హెలికాఫ్టర్ ద్వారా కేదార్‌నాథ్ చేరుకోవాలి. కానీ, ఇప్పుడు రోప్ వే ఈ ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా వృద్ధులు, దివ్యాంగ యాత్రికులకు మరింత సమ్మిళిత అనుభవాన్ని అందిస్తుంది.
- Advertisement -