Thursday, March 6, 2025

చెలరేగిన కివీస్ బ్యాట్స్‌మెన్.. సఫారీలకు భారీ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

లాహోర్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీఫైనల్‌లో న్యూజిలాండ్.. సౌతాఫ్రికాకు భారీ టార్గెట్‌ను ముందుంచింది. కేన్ విలయమ్‌సన్, రచిన్ రవీంద్రల శతకాలు, ఫిలిప్స్, మిషెల్‌ల అద్భుతమైన బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ 362 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న కివీస్ జట్టుకు ఎనిమిదో ఓవర్‌ చివరి బంతికి ఓపెనర్ విల్(21) వికెట్ తీసి ఎంగిడి బ్రేక్ వేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కేన్ విలియమ్‌సన్, రచిన్ రవీంద్రలు నిలకడగా బ్యాటింగ్ చేస్తూ.. స్కోర్‌బోర్డుపై పరుగులు పెంచుతూ వచ్చారు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కి 164 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. ఈ క్రమంలో రచిన్ రవీంద్ర(108), కేన్ విలియమ్‌సన్(102) సెంచరీలు సాధించారు. అయితే కొన్ని ఓవర్ల తేడాతోనే ఈ ఇద్దరు బ్యాటర్లు పెవిలియన్ చేరారు.

ఆ తర్వాత డరైల్ మిషెల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సుతో 49 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక వికెట్ కీపర్ టామ్ లాథమ్‌(4) రబడా క్లీన్ బౌల్డ్‌ చేశాడు. ఈ క్రమంలో గ్లెన్ ఫిలిప్స్ చెలరేగిపోయాడు. 28 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సుతో 49 పరుగులు చేశాడు. ఫలితంగా న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలింగ్‌లో ఎంగిడి 3, రబాడా 2, ముల్డర్ 1 వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News