Thursday, March 6, 2025

అభివృద్ధి లేక రేవంత్‌రెడ్డి రాజకీయాలను పక్కదారి పట్టిస్తున్నారు:ఎంపి ధర్మపురి

- Advertisement -
- Advertisement -

తన పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోజు రోజుకూ దిగజారి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. ఆయన అధికారం చేపట్టిన నాటి నుంచి చేసిన అభివృద్ది ఏమీ లేకపోవడంతో రాజకీయాలు పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్వింద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో విఫలమైందనడానికి మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమే నిదర్శమని అన్నారు. సీఎం పదవి తొలగిస్తే రేవంత్ చూస్తూ ఊరుకోడని, నిజంగా అదే జరిగితే తాను వ్యక్తిగతంగా బీజేపీలోకి ఆహ్వానిస్తానని అన్నారు.

అయితే ఆయనను తీసుకుంటారా లేదా అనేది మాత్రం తన చేతిలో లేదని అర్వింద్ పేర్కొన్నారు. తెలంగాణకు ప్రధాని మోడీ ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరు చేశారని అన్నారు. తన పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల, నిజామాబాద్‌కు రెండు వచ్చాయని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కూడా తాను మాట్లాడానని, నవోదయాల్లో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎక్కువగా చేరుతారని జిల్లా కేంద్రంలో పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. నిజామాబాద్‌లో ఇప్పటికే కొనసాగుతోందని తెలిపారు. ఫ్యూచర్ సిటీకి లోటస్ అని పేరు పెడతాడేమో అందుకే మోడీని మంచోడని రేవంత్ పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు. అలా పెట్టుకుంటామంటే కచ్చితంగా అనుమతిస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News