ఎంఎల్‌ఎ కోటా
ఎంఎల్‌సి టికెట్లకు
భారీగా దరఖాస్తులు
అభ్యర్థుల ఎంపిక
విధివిధానాలపై కసరత్తు
సిఎం ఇంట్లో కాంగ్రెస్
కోర్‌కమిటీ భేటీ
మరోసారి సమావేశం
కావాలని నిర్ణయం
శుక్రవారం ఢిల్లీకి
సిఎం రేవంత్‌రెడ్డి
రెండు రోజుల పాటు
అక్కడే మకాం 7,8
తేదీల్లో అభ్యర్థుల
జాబితాకు తుదిరూపం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కోర్ కమిటీ భేటీ అ య్యిం ది. జూబ్లీహిల్స్‌లోని సిఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్, పి సిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు పాల్గొన్నారు. గంటకుపైగా కొనసాగిన ఈ సమావేశంలో ఎ మ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు అనుసరించాల్సిన విధి, విధానాలపై చ ర్చించినట్లుగా తెలుస్తోంది. ఈనెల 29వ తేదీన ఐదు ఎమ్మెల్సీ స్థా నాలు ఖాళీ ఏర్పడుతున్నాయి. వాటిని భర్తీ చేసేందుకు ఇప్పటికే ఎ న్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నెల 10వ తే దీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవడానికి గడువు విధించింది. ప్రధానంగా ఖాళీ ఏర్పడిన 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బిఆర్‌ఎస్‌కు, మిగిలినవి కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి. ఈ నాలుగు స్థా నాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పిసిసి కోర్ కమిటీ ఈ కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం నిర్వహించారు. మరోసారి సమావేశం కావాలని పిసిసి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవుల కోసం పిసిసికి భారీ సంఖ్యలో దరఖాస్తులు అందినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి ముందు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కలిశారు.
శుక్రవారం ఢిల్లీకి సిఎం రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారు. సిఎం రేవంత్ రెండు రోజులు పాటు అక్కడే ఉండే అవకాశం ఉందని పిసిసి వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఈ నెల 7, 8 తేదీల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపిక తుది రూపానికి వచ్చే అవకాశం ఉందని పిసిసి వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 7,8 తేదీల్లో ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉంటుండడంతో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మాజీ పిసిసిఅధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కోర్ కమిటీ మొత్తం ఢిల్లీలో అందుబాటులో ఉండడం వల్ల ఏఐసిసితో చర్చించి అభ్యర్థులు ఎంపికపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని పిసిసి వర్గాలు పేర్కొంటున్నాయి.
ఏఐసిసి క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే జాబితా
ప్రధానంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఏఐసిసి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి వద్ద కోర్ కమిటీ సమావేశమయ్యింది. అభ్యర్థుల ఎంపిక కోసం అనుసరించాల్సిన విధి, విధానాలపై దాదాపు గంట పాటు చర్చ కొనసాగింది. విధి, విధానాలకు లోబడి ఉన్న ఆశావహుల జాబితాను సిద్ధం చేయనున్నారు. అర్హులను సామాజిక వర్గాల వారీగా సమతుల్యత పాటించే విధంగా జాబితాను సిద్ధం చేసి ఏఐసిసికి నివేదించనున్నారు. ముఖ్యమంత్రితో కూడిన కోర్ కమిటీ నివేదించిన జాబితాను ఏఐసిసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటుంది.