నకిరేకల్ ఎంఎల్‌ఎ
వేముల వీరేశంకు సైబర్
నేరగాళ్ల బెదిరింపు
మన తెలంగాణ/కట్టంగూర్ : న ల్లగొండ జిల్లా, నకిరేకల్ ఎంఎల్‌ఎ వేముల వీరేశంకు సైబర్ నేరగాళ్లు న్యూడ్ వీడియో కాల్ చేసి డబ్బు లు ఇవ్వాలని బెదిరించడం జిల్లా లో కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి తన క్యాంపు ఆఫీస్ లో ఎంఎల్‌ఎ తన అనుచరులతో మాట్లాడుతుండగా సైబర్ నేరగా ళ్లు వీడియో కాల్ చేశారు. దీంతో ఆయన కాల్ లిఫ్ట్ చేయడంతో అ వతలి వ్యక్తి నగ్నంగా కనిపిస్తూ కా ల్ మాట్లాడాడు. ఈ క్రమంలో కే టుగాళ్లు ఫోన్‌స్క్రీన్ రికార్డు చే శా రు. అనంతరం సైబర్ నేరగాళ్లు ఆ వీడియోను ఆయనకే పంపించా రు. వీడియో విషయంపై బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. ఆయన స్పందించకపోవడంతో ఆ వీడియోను కొంతమంది కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు వారు పంపారు. ఎంఎల్‌ఎ అభిమానులు అంతా వెంటనే ఆయనకు ఫోన్ చేయడంతో పసిగట్టిన ఆయన అప్పటికప్పుడే అలర్ట్ అయ్యారు. ఈ సంఘటనపై ఎంఎల్‌ఎ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించి వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సలహాలతో సైబర్ నేరగాళ్ల నెంబర్‌ను బ్లాక్ చేశారు. నూడ్ ఫోన్‌కాల్ వచ్చిన నెంబర్‌ను బ్లాక్ చేయించారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ ఫోన్ కాల్ మధ్యప్రదేశ్ నుండి వచ్చినట్లు గుర్తించారు.
సైబర్ కాల్ పై స్పందించిన వీరేశం :
సైబర్ నేరగాళ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నకిరేకల్ ఎంఎల్‌ఎ వేముల వీరేశం అన్నారు. సైబర్ నేరగాళ్ల నుండి తనకు వచ్చిన న్యూడ్ వీడియో కాల్ కలకలంపై నకిరేకల్ లోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపిందని అన్నారు. సైబర్ నేరగాళ్లు విఐపిలను కూడా టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. అమాయక ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్ట పోతున్నారని, సైబర్ నేరగాళ్ల వలలో ప్రజలు పడకుండా అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ అలాంటి ఫోన్‌కాల్స్ వచ్చిన వెంటనే పోలీస్‌లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలంతా సెల్‌ఫోన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. సైబర్ నేరగాళ్ల విషయంలో ఆన్లైన్ గేమింగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమాశంలో పిఏసిఎస్ ఛైర్మన్ నాగులంచ వెంకటేశ్వర్‌రావు, నకిరేకల్ మున్సిపల్ ఛైర్మన్ చెవుగోని రజిత శ్రీనివాస్ గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.