- Advertisement -
ఎపిలోని విశాఖ గాజువాకలో దొంగలు చెలరేగిపోయారు. కూర్మపాలెంలోని కాపుజగ్గరాజుపేట వసుధ గార్డెన్స్‌లో చోరీకి తెగబడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడి 90 తులాల బంగారం అపహరించి ఉడాయించారు. తలుపులు తెరిచి ఉండటంతో ఇరుగు పొరుగు వాళ్లు విషయాన్ని యజమానికి తెలిపారు. దీంతో బాధితులు ఈ విషయమై దువ్వాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమాచా రాన్నందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. క్లూస్ టీంతో ఇంట్లో చోరీ జరిగిన ప్రాంతాన్ని క్షణ్ణంగా తనిఖీలు చేశారు. స్థానిక సిసిటివి ఫుటేజులను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నా రు. ప్రత్యేక బృందాలతో గాలిస్తామని వెల్లడించారు.
- Advertisement -