- Advertisement -
మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో స్వీటీ అనుష్క స్థానం వేరు అని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ అందాలతార నటిస్తున్న చిత్రం ఘాటీ. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ బాగానే అలరించాయి. కానీ ఇప్పుడు రిలీజ్ దగ్గరకి వస్తున్నప్పటికీ మేకర్స్ మౌనంగా ఉండడం అనేది ఫ్యాన్స్‌లో టెన్షన్‌గా మారింది. అయితే మేకర్స్ సహా అనుష్క ఈ సినిమా ప్రమోషన్స్‌ని ఈ నెల మధ్య నుంచి లేదా ఆ తర్వాత ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
- Advertisement -