- Advertisement -
ఏలూరు: హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం ముగ్గురు మృతి చెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి బస్సు బోల్తా పడి.. పూర్తిగా దెబ్బతింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. గాయపడిన వారిని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పరామర్శించారు. ఆమె స్వయంగా ఆస్పత్రికి వెళ్లి.. గాయపడిన వారికి అందిస్తున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు.
- Advertisement -