ముంబై: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయవంతంగా ఫైనల్స్‌కు చేరింది. టోర్నమెంట్ ఆరంభం నుంచి అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శ చేస్తున్న టీం ఇండియా ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. అయితే ఫైనల్స్‌కి ముందు టీం ఇండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్‌పై మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు. ఎలాంటి స్వార్థం లేకుండా.. భగత్‌సింగ్‌ల అతను దేశం కోసం కష్టపడుతున్నాడని ఆయన అన్నారు.
స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సిద్ధూ మాట్లాడుతూ.. ‘రాహుల్‌ను స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడేశారు. అతను కీపింగ్ చేస్తాడు.. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు.. ఒక్కోసారి ఓపెనింగ్ కూడా చేస్తాడు. బార్డర్-గవాస్కర్ ట్రోఫీకి వస్తే.. బౌలర్లను తట్టుకునేందుకు మూడో స్థానంలో కూడా బ్యాటింగ్ చేస్తాడు, ఓపెనింగ్ కూడా చేస్తాడు. టెస్ట్ క్రికెట్‌లో ఓపెనింగ్ చేయడం కంటే కష్టమైనది భూమ్మీద లేదు. ఎక్కడ క్లిష్టమైన పరిస్థితి ఉండే రాహుల్‌ని అడగగానే అతను అక్కడ ఆడుతాడు. దేశం కోసం నిస్వార్థంగా త్యాగం చేస్తాడు.. భగత్ సింగ్‌లా. అందుకే ఆయనకు అంతా గొప్పపేరు వచ్చింది’ అని సిద్ధూ తనదైన శైలీలో చెప్పుకొచ్చారు.