Friday, March 7, 2025

ఇదేం పద్ధతి.. ట్రైన్ నుంచి చెత్త విసిరేస్తున్న అధికారి

- Advertisement -
- Advertisement -

ఓవైపు దేశ వ్యాప్తంగా స్వచ్చభారత్ పేరిట దేశవ్యాప్తంగా ప్రజలు చెత్తను శుభ్రం చేస్తుంటే.. మరికొందరు మాత్రం చెత్తను పారవేయడంలో ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి సంఘటనే ఓ ట్రైన్‌లో చోటు చేసుకుంది. ట్రైన్‌లో నుంచి ఓ ఐఆర్‌సిటిసి ఉద్యోగి చెత్త విసిరేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

సుబేదార్‌గంజ్ నుంచి ముంబై వెళ్తున్న ట్రైన్‌లోని చెత్తబుట్ట నిండిపోవడాన్ని గమనించిన ఓ సీనియర్ అధికారి.. కదులుతున్న ట్రైన్‌ తలుపు నుంచి చెత్తను బయటకు విసరడం ప్రారంభించారు. అలా చేయకండి అంటూ.. అక్కడి వాళ్లు చెబుతున్నా.. ఆయన ఖాతరు చేయలేదు. అంతేకాదు.. ‘మరి ఈ చెత్తను ఇంకెక్కడ వేయమంటారు’ అంటూ నవ్వుతూ సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇది మన రైల్వే వ్యవస్థ దుస్థితి’ అంటూ కామెంట్ చేస్తున్నారు.

అయితే దీనిపై రైల్వే సేవ వెంటనే స్పందించింది. విధుల్లో ఉండి నిబంధనలు ఉల్లంఘించిన సిబ్బందిపై చర్యలు తీసుకొని జరిమానా కూడా విధించామని ఓ ప్రకటనలో వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News