హైదరాబాద్: కాంగ్రెస్ ను ఓడించేందుకు బిజెపి, బిఆర్ఎస్ కుట్ర చేస్తుందని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ఎమ్మెల్సి ఎన్నికల్లో బిజెపి, బిఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై గాంధీభవన్ లోఆయన మీడియాతో మాట్లాడారు. బిజెపి, బిఆర్ఎస్ కలిసి రంజాన్ గిఫ్ట్ ఇచ్చాయా?నని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి, బిఆర్ఎస్ కలిసి పని చేశాయని బిఆర్ఎస్ బలం అంతా పెట్టి బిజెపికి సపోర్ట్ చేసిందని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఆ రెండు పార్టీలు కలిసి ఓడించాయని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్ట్ ఇచ్చామని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చానన్నారు. తాము బిజెపికి ఎన్నో గిఫ్టులు ఇచ్చామని, త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం: శ్రీధర్ బాబు
- Advertisement -
- Advertisement -
- Advertisement -