Friday, March 7, 2025

ఛత్తీస్‌గఢ్‌లో అంతుపట్టని వ్యాధి.. ఒకే నెలలో 13 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఝార్ఖండ్ : ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో ధనికోర్తా గ్రామంలో ఒకే నెలలో 13 మంది మృతి చెందారని తెలియగానే వైద్య విభాగం అప్రమత్తమైంది. ధనికోర్తాలో వైద్య సేవలు అందిస్తోంది. బాధితుల్లో ఛాతినొప్పి , విడవకుండా దగ్గు వంటి లక్షణాలు కనిపించాయి. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆ గ్రామంలో దాదాపు ప్రతి ఇంటి లోని వ్యక్తులు ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్టు వెల్లడించాయి. ఈ వ్యాధి వార్తలపై సుక్మా ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కపిల్‌దేవ్ కశ్యప్ మీడియాతో మాట్లాడారు. కొద్ది రోజులుగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. వారిలో ముగ్గురు వృద్ధాప్య సమస్యలతో చనిపోయారు. మిగతా ఇద్దరి మృతికి కారణాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు గుర్తించిన దాని ప్రకారం వాతావరణంలో మార్పులు, మహువా పంట సేకరణ కారణాలు కావొచ్చని చెప్పారు. ఈ పంట సేకరణ నిమిత్తం గ్రామస్తులు రోజంతా అటవీ ప్రాంతం లోనే ఉంటారు. దాంతో వారు డీహైడ్రేషన్‌కు గురై అనారోగ్యానికి పాలవుతున్నారని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News