Friday, March 7, 2025

గాయని శివశ్రీ స్కందప్రసాద్‌ను వివాహమాడిన ఎంపీ తేజస్వీ సూర్య

- Advertisement -
- Advertisement -

భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు(దక్షిణ) ఎంపీ తేజస్వీ సూర్య(34) గురువారం గాయని, భరతనాట్యం కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు. వేదోచ్చరణల నడుమ సాంప్రదాయికంగా వారి వివాహం జరిగింది. ఈ వివాహానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర, కేంద్ర మంత్రులు వి.సోమన్న, అర్జున్ రామ్ మేఘ్వాల్, బిజెపి ఎంపీలు, ఎంఎల్‌ఏలు హాజరయి వధూవరులను ఆశీర్వదించారు. తేజస్వీ సూర్య, శివశ్రీ ఇటీవల ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్ ఆశ్రమంకు వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. శివశ్రీ ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా ద్వారా నేపథ్య గాయనిగా గుర్తింపు పొందారు. తేజస్వీ సూర్య బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News