- Advertisement -
లక్షలాది వయోజనులకు ఆరోగ్య వసతి, ఇతర సేవలు అందిస్తున్న వెటరన్స్ అఫైర్స్ శాఖ నుంచి 80వేల మంది ఉద్యోగులను ట్రంప్ పాలకవర్గం తొలగించాలని యోచిస్తున్నట్లు ఓ అంతర్గత మెమో బుధవారం వెల్లడించింది. వెటరన్స్ అఫైర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ క్రిస్టోఫర్ సిరెక్ మంగళవారం ఏజెన్సీలోని ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడుతూ 2019 నాటి సిబ్బంది స్థాయికి అంటే 400000 కన్నా తక్కువకు ఉద్యోగులను తగ్గించాలనే లక్షంతో ఉన్నట్లు తెలిపారు. దీని వల్ల వేలాది మంది ఉద్యోగులను టర్మినేట్ చేయొచ్చునని తెలుస్తోంది. బైడెన్ పాలన కాలంలో వెటరన్స్ అఫైర్స్ శాఖలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదిలావుండగా వెటరన్స్ అఫైర్స్ శాఖలో ఉద్యోగులను తగ్గించాలనే ట్రంప్ యోచనను వయోజనులు ఇప్పటికే తూర్పారబడుతున్నారు.
- Advertisement -