Friday, March 7, 2025

నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో మలుపు

- Advertisement -
- Advertisement -

దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తాజాగా ఇది మరో మలుపు తిరిగింది. నటి బంగారం స్మగ్లింగ్ వెనుక ఓ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్టు కథనాలు బయటికొచ్చాయి. దీంతో ఈ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రన్యారావు నివాసంలో పోలీసులు సోదా చేసి స్వాధీనం చేసుకున్న ఆభరణాలు ఓ రాజకీయ నాయకుడి తరఫున బెంగళూరు లోని ఓ జువెల్లరీ బొటిక్ నుంచి కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ నగల ధరను ఎవరు చెల్లించారు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో నటికి ఉన్న రాజకీయ పరిచయాలతో సంబంధం లేకుండా చట్టం తన పని తాను చేస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి న్యాయ సలహాదారు ఏఎస్ పొన్నన్న వ్యాఖ్యానించారు. ఇందులో అధికారుల, రాజకీయ నాయకుల జోక్యం ఉంటే దర్యాప్తులో బయటపడుతుందన్నారు.’

కిలో బంగారానికి రూ. లక్ష చొప్పున
రన్యారావు స్మగ్లింగ్ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగు లోకి వచ్చాయి. గత ఏడాదిలో ఆమె దాదాపు 30 సార్లు దుబాయ్‌కి వెళ్లొచ్చినట్టు తెలుస్తోంది. కిలో బంగారం స్మగ్లింగ్ చేసినందుకు గాను ఆమె రూ. లక్ష చొప్పున వసూలు చేసినట్టు సమాచారం. అంటే ప్రతిట్రిప్‌నకు రూ.1213 లక్షలు తీసుకునేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఇటీవల దుబాయ్ నుంచి బెంగళూరుకు 14.2 కిలోల బంగారంతో వచ్చిన ఆమెను విమానాశ్రయం నుంచి నిష్క్రమించే చివరి నిమిషంలో అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News