Friday, March 7, 2025

38వ జాతీయ పోటీల్లో బంగారు పతకం సాధించిన గురుకుల విద్యార్థిని

- Advertisement -
- Advertisement -

ఉత్తరాఖండ్ రాష్టంలోని డెహ్రాడూన్ లో నిర్వహించిన 38 వ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాష్టానికి చెందిన గురుకుల విద్యార్థిని నందిని బంగారు పతకం సాధించింది. సంగారెడ్డి జిల్లా బుదేరా సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో బ్యాచులర్ అఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బిబిఎ ) కోర్సులో అగసారా నందిని ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ వెల్లడించింది. ఈ జాతీయ క్రీడలలో 38 జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 10 వేల మంది అథ్లెట్లు, అధికారులు పాల్గొన్నారు. హరిద్వార్, నైనిటాల్, హల్ద్వానీ, రుద్రపూర్, శివపురి, న్యూ టెహ్రీ అనే ఆరు నగరాల్లో పోటీలు జరిగాయి. అథ్లెటిక్స్, షూటింగ్, రెజ్లింగ్, స్విమ్మింగ్, హాకీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, ఫుట్‌బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ వంటి ఒలింపిక్ క్రీడలను నిర్వహించారు.

దేశంలోని అన్ని రాష్టాలనుండి క్రీడా కారులు ఈ పోటీల్లో పాల్గొనగా కేవలం 10 మంది మాత్రమే ఫైనల్ లో పోటీ పడేందుకు అర్హత సాధించారు. ఫైనల్ పోటీల్లో అగసారా నందిని బంగారు పతకాన్నికైవసం చేసుకొంది . అథ్లెట్ లో హెప్టాతలాన్ విభాగంలో నందిని తన సత్త చాటింది. హెప్టాతలాన్ లో మొత్తం ఏడూ రకాలైన ఈవెంట్స్ ఉంటాయి. 100 మీటర్ల హర్డిల్స్, హై జంప్ , షార్ట్ ఫుట్, 200 మీటర్స్ , జావెలిన్ త్రో, లాంగ్ జంప్, 800 మీటర్స్ ఈవెంట్స్ లో పూర్తిగా పైచేయి సాధిస్తేనే క్వాలిఫై అవుతారు . ఇలా మొత్తం ఏడు ఈవెంట్స్ లో నందిని తన సత్తా చాటి మొదటి స్థానంలో నిలవడంతో గోల్ మెడల్ సాధించింది. ఈ సందర్బంగా తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డా. విఎస్ అలగు వర్షిణి మాట్లాడుతూ గురుకులాల విద్యార్థులు కేవలం చదువు మాత్రమే కాకుండా, క్రీడల్లో కూడా తమ ప్రతిభను ప్రదర్శించి, విజయం సాధించవచ్చని స్పష్టమైన సందేశం అందిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. క్రీడలు, విద్యతో పాటు, శరీర ప్రేరణను, నైపుణ్యాలను, సహనాన్ని పెంచేందుకు ఎంతో దోహదపడతాయని అన్నారు.

సాంఘిక సంక్షేమ గురుకులాలను మరింత తీర్చిదిద్దెందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని, యువతను క్రీడలో పాల్గొనేందుకు ఎంతో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. క్రేడాకారులకు కావాల్సిన తర్ఫీదు ఇచ్చేందుకు కోచ్ లను వారికీ కావాల్సిన వసతులను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అలగు వర్షిణి చెప్పారు. గోల్ మెడల్ అందుకోవడం పట్ల క్రీడాకారిణి ఆగసారా నందిని సంతోషం వ్యక్తం చేసారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు అన్నిరకాలుగా సహకరించిన గురుకుల కార్యదర్శి డా. విఎస్. అలగు వర్షిణికి కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ ,అధ్యాపకులతో పాటు కోచ్ తనకు ప్రోత్సహించి ఈ ఈవెంట్స్ లో పాల్గొనేలా కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News