నయనతార లీడ్ రోల్‌లో సుందర్ సి దర్శకత్వంలో వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌లలో ఒకటైన ‘మూకుతి అమ్మన్ 2’ను నిర్మిస్తోంది. అవ్ని సినిమాక్స్ ప్రై. లిమిటెడ్, రౌడీ పిక్చర్స్ సహా నిర్మాతలుగా ఉన్నాయి. ఈ చిత్రం గురువారం రూ.1 కోటి విలువైన అద్భుతమైన సెట్ వర్క్‌తో గ్రాండ్ పూజా వేడుకతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో చిత్ర నటీనటులు, సిబ్బందితో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సునీల్ నారంగ్, జగదీష్, సి కళ్యాణ్ పాల్గొన్నారు. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇషారి కె గణేష్ ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి మూకుతి అమ్మన్ 2ను భారీ స్థాయిలో విజువల్ వండర్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ లిమిటెడ్ నవ్వులతో కూడిన ఆసక్తికరమైన కథాంశంతో వుంటుంది. సుందర్ సి, నయనతార తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలో పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.
‘మూకుతి అమ్మన్ 2’ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
- Advertisement -