పార్టీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ హైకమాండ్ ఆరా వివిధ జిల్లాల 48 మంది
సీనియర్ నేతలతో గాంధీభవన్‌లో ఎఐసిసి కార్యదర్శుల భేటీ నామినేటెడ్ పోస్టుల
భర్తీ, ఎంఎల్‌సి అభ్యర్థుల ఎంపిక సహా వివిధ అంశాలపై చర్చ, అభిప్రాయ
సేకరణ అధిష్ఠానానికి రెండు రోజుల్లో నివేదిక ఎఐసిసి చీఫ్ ఖర్గేతో విజయశాంతి
భేటీ? ఎంఎల్‌సిగా అవకాశం ఇవ్వాలని వినతి ఢిల్లీకి హుటాహుటిన జగ్గారెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ పనితీ రు, పార్టీ పరిస్థితులపై ఏఐసిసి దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేతలతో ఏఐసిసి నా యకులు గాంధీభవన్‌లో గురువారం భేటీ అయ్యా రు. పలు జిల్లాల్లో పార్టీలో నెలకొన్న పరిస్థితులు, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయాలను ఏఐసిసి నాయకులు సీనియర్‌లను అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు త్వరలో భర్తీ చేయనున్న నా మినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు తదితర వాటికి సంబంధించి ఆయా జిల్లాలో అర్హులు ఎవరన్న దానిపై కూడా ఆరా తీ శారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ లో పు నామినేషన్‌లు వేయాల్సి ఉంది. నామినేషన్‌ల కు 10వ తేదీ ఆఖరిరోజు కాగా, అదే రోజు నామినేటెడ్ పోస్టులను ఆశించే వారి పేర్లను కూడా ఇవ్వాలని ఇప్పటికే అధిష్టానం ఆదేశించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన
పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనూ తెలియచేశారు. ఈ నేపథ్యంలోనే ప దేండ్లుగా పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నా యకులతో ఏఐసిసి కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథ్ గురువారం భేటీ అయ్యారు. అందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నుంచి 48 మంది సీనియర్ నాయకులను గురువారం గాంధీభవన్‌కు ఏఐసిసి నాయకులు పిలిచారు. ఏఐసిసి కార్యదర్శులు విష్ణునాథ్ 24 మందితో, విశ్వనాథన్ మరో 24 మందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీయడంతో పాటు గత, ప్రస్తుత పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
పార్టీలో ఎంత కాలం నుంచి కొనసాగుతున్నారు?, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఏ నియోజకవర్గానికి ఇంచార్జీగా ఉన్నారు? అక్కడ పార్టీ గెలిచిందా? ఓడిందా?, పార్టీలో ఇప్పుడు మీరు ఏ పదవి ఆశిస్తున్నారు?’ అన్న విషయాలను వారు అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు ఆయా జిల్లాల్లో సీనియర్ నాయకులు, కార్యకర్తల పరిస్థితి, పార్టీకి వారు ఎలాంటి సాయం అందిస్తున్నారన్న విషయాల గురించి వారు చర్చించారు. ఏఐసిసి కార్యదర్శులతో భేటీ అయిన వారిలో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణలతో పాటు పలువురు పిసిసి ఆఫీసు బేరర్లు, పలు నియోజకవర్గాలకు చెందిన నేతలతో ఏఐసిసి కార్యదర్శులు ఉన్నారు. అయితే, 48 మందితో చర్చించిన విషయాలను నివేదిక రూపంలో అధిష్టానానికి ఏఐసిసి కార్యదర్శలు అందచేయనున్నట్టుగా తెలిసింది. ఈనెల 08, 09వ తేదీన ఎమ్మెల్సీ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించే అవకాశం ఉండడం, ఈనెల 20వ తేదీలోగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని ఏఐసిసి నిర్ణయించిన నేపథ్యంలో ఏఐసిసి కార్యదర్శులు సీనియర్ నాయకులతో గాంధీభవన్‌లో గురువారం సమావేశమయినట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఖర్గేను కలిసిన విజయశాంతి
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ పోస్టులకు ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల10వ తేదీలోపు నామినేషన్లు వేయాల్సి ఉన్నందున ఆశావహులు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సినీ నటి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి ఢిల్లీ వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఏఐసిసి పెద్దల సహకారంతో ఎమ్మెల్సీ టికెట్ పొందాలని ఆమె భావిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. టికెట్‌ను ఆశిస్తున్న విజయశాంతి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసి తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టుగా సమాచారం. దీంతోపాటు
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరడం చర్చనీయాంశంగా మారింది. అయితే తాను ఎమ్మెల్సీ పదవి కోసం ఢిల్లీ వెళ్లడం లేదని, రాహుల్ గాంధీని కలిసేందుకే వెళ్తున్నానని జగ్గారెడ్డి చెబుతున్నారు.