కొత్త రెవెన్యూ డివిజన్లు, నూతన
మండలాల్లో 217 కొలువులు
33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు,
10 జిల్లా కోర్టుల్లో 55 పోస్టులు
మంజూరు ఎస్‌సి వర్గీకరణ
ముసాయిదా బిల్లుకు పచ్చజెండా
న్యాయపరమైన చిక్కులు
తలెత్తకుండా తుది డ్రాఫ్ట్ ఉగాది
నుంచి భూభారతి అమలు ఈ నెల
12 నుంచి 27 వరకు అసెంబ్లీ బడ్జెట్
సమావేశాలు బిసి రిజర్వేషన్ల
బిల్లుకు ఆమోదం నదీ జలాల
అంశంపై ప్రత్యేక కమిటీ 30వేల
ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ యాదగిరి
గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ
బోర్డు ఏర్పాటు ఒకే గొడుగు
కిందకు మహిళా సంఘాలు 27
కొత్త పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి
డీలిమిటేషన్‌పై అఖిలపక్షం
1335 గ్రామాలకు హెచ్‌ఎండిఎ
విస్తరణ కొత్తగా ఎఫ్‌సిడిఎ ఏర్పాటు
పారాలింపిక్ విజేతలకు ప్రభుత్వ
ఉద్యోగాలు రాష్ట్ర కేబినెట్ భేటీలో
పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
సిఎం రేవంత్ అధ్యక్షతన ఏడు
గంటల పాటు సుధీర్ఘ భేటీ కేబినెట్
నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు
పొంగులేటి, పొన్నం
10,950 గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులు
మన తెలంగాణ/హైదరాబాద్: నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి జరిగే నష్టం పై రాష్ట్రంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి చర్చిస్తామ ని, భేషజాలు లేకుండా అన్ని పార్టీల ను పి లుస్తామని, ఈ బాధ్యతలను డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, సీనియర్ నాయకు డు జానారెడ్డికి అప్పగించాలని గురువా రం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయిం చారు. అంతకు ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సుమారు ఏడుగంటల పాటు సుధీర్ఘం గా సమావేశమైంది. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణ యాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. సుప్రీం తీర్పు మేరకు వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని సిఎం స్పష్టం చేశారని…ఆ తర్వాత వెంటనే షమీమ్ అక్తర్ కమిషన్‌ను నియమించినట్టు మంత్రి పొం గులేటి వివరించారు. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఎస్సీ కులాల వర్గీకరణపై డాక్టర్ జస్టిస్ షమీ అక్తర్ కమిషన్ మార్చి 2 వ తేదీన తమ రెండో నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందన్నారు. ఫిబ్రవరి 3వ తేదీన కమిషన్ ఇచ్చి న మొదటి నివేదికలో చేసిన సిఫారసులను ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా యధాతధంగా ధ్రువీకరించిందని తెలిపారు
వివిధ వర్గాల నుంచి వచ్చిన 71 విజ్ఞప్తులను రెండో విడతలో కమిషన్ పరిశీలించిందని, కమిషన్ ఇచ్చిన నివేదిక లోని అంశాలపై కేబినెట్‌లో చర్చ జరిగిందన్నారు. న్యాయ పరమైన చిక్కులు లేకుండా న్యాయ నిపుణుల సలహాలతో బిల్లు ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారన్నారు.ఫ్యూచర్ సిటీ డెవెలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు కు నిర్ణయం తీసుకున్నామన్నారు. 7 మండలాలు, 56 గ్రామాలతో ఎఫ్ సీడీఏ ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలిపిందన్నారు. నాగార్జునసాగర్ హై వే నుంచి శ్రీశైలం హైవే మధ్యన ఉన్న దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్‌సిటీని అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 36 గ్రామాలను హెచ్‌ఎండిఎ పరిధి నుంచి తొలగించి ఎఫ్‌సిడిఎకు అప్పగిస్తారని, ఫ్యూచర్ సిటీ డెవెలప్మెంట్ అథారిటీకి రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ కలిపి 90 పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ——హెచ్‌ఎండిఎ పరిధిని రీజినల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలనే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించిందన్నారు. మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలతో హెచ్‌ఎండిఎ పరిధి పెరుగనుందన్నారు. ఈ విస్తరణతో కొత్తగా 332 రెవెన్యూ గ్రామా లు హెచ్‌డిఎ పరిధిలో కలుస్తాయన్నారు. —— ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా కొత్త పాలసీని ప్రభుత్వం రూప కల్పన చేసిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలు సెర్పఅధ్వర్యంలో, పట్టణ ప్రాంతాల్లో మెప్మా అధ్వర్యంలో తమ కార్యకలాపాలు చేపడుతున్నాయన్నారు. ఇకపై రాష్ట్రంలోని అన్ని మహిళా శక్తి సంఘాలను ఒకే గొడుగు కిందకు తీసుకు రానున్నామన్నారు. ఇందిరా మహిళా శక్తి సంఘాల్లోని సభ్యుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏండ్ల నుంచి 65 ఏళ్లకు పెంచి గ్రూప్ ల్లో చేరే కనీస వయస్సును 18 ఏళ్ల నుంచి 15 ఏళ్ల కు తగ్గించామన్నారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అందుకు వీలుగా తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ -1987 కు సవరణలు చేయనున్నామన్నారు. తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030 కి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 27 స్పెషల్ టూరిజం ఏరియాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాబోయే 5 ఏళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో కొత్త పాలసీకి రూపకల్పన చేశామన్నారు.
మే నెలలో జరిగే మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ లో ఆతిథ్యం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. దాదాపు 140 దేశాలు పాలుపంచుకునే ఈ వేడుకలను తెలంగాణ కు ప్రపంచంలో పేరు తెచ్చేలా నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. —-10954 గ్రామ పరిపాలన అధికారుల నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవో నియమించాలని నిర్ణయం తీసుకుందన్నారు. గతంలో వీఆర్వో, వీఆర్‌ఏలుగా పని చేసిన వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ———-గంధమల్ల రిజర్వాయర్ కెపాసిటీని 4.28 టీఎంసీల నుంచి 1.41 టీఎంసీల కు తగ్గించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు.
——-శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలో రాయికుంట గ్రామంలో 5.15 ఎకరాల భూమిని 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. పారాలింపిక్స్ 2024 కాంస్య పతక విజేత దీప్తి జీవాంజీకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించిందన్నారు. అలాగే, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల్లో 361 పోస్టుల కు ప్రభుత్వ ఆమోదం తెలిపిందన్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూట్ సొసైటీ పరిధిలో 330 రెగ్యులర్ పోస్టులకు, 165 అవుట్ సోర్సింగ్ మొత్తం 495 పోస్టులకు ఆమోదం తెలిపిందన్నారు.
బిసిలకు 42శాతం : పొన్నం ప్రభాకర్
ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు సంబంధించి జరిపిన కుల సర్వే బలహీన వర్గాల మేదావులు, కుల సంఘాల నేతల సమావేశం సంప్రదింపుల తరువాత మిస్ అయిన వారికి మరోసారి అవకాశం ఇవ్వడం జరిగిందని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాబోయే శాసన సభ సమావేశాల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలనే ముసాయిదా చట్టానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రాజకీయ, విద్య ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం బీసీ లకు రిజర్వేషన్లు ఉండాలని వేరు వేరు బిల్లులు పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. గతంలో 2017 లో 37 శాతానికి తీసుకున్న నిర్ణయం బిల్లు వెనక్కి తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. బలహీన వర్గాలకు సంబంధించి ప్రభుత్వం చెప్పినట్టు కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ఫిబ్రవరి 4 2024 న ఆమోదించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టీనప్పటి నుండి ఫిబ్రవరి 4 2025 వరకు చట్టని తీసుకొచ్చి నిర్ణయం నుండి నివేదిక వరకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తోందని, అందరూ సహకరించాలని కోరారు.