ముంబై: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై హైకోర్టు షాక్ ఇచ్చింది. చెక్కు బౌన్స్ కేసులో ఆయనకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. ఈ కేసులో తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలంటూ వర్మ దాఖలు చేసిన పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. జనవరి 21న అంధేరీలోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వైపి పూజారి ఆర్‌జివి శిక్షార్హుడని నిర్ధారించి మూడు నెలల విధించారు. అంతేకాక ఫిర్యాదు చేసిన వ్యక్తికి రూ.3.72 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ ఆర్‌జివి సెషన్స్ కోర్టులో అప్పీలు దాఖలు చేయగా.. మార్చి 4వ తేదీన అప్పీల్‌ను తిరస్కరిస్తూ.. వర్మకు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను అదనపు సెషన్స్ జడ్జీ ఎఎ కులకర్ణి తీర్పు ఇచ్చారు. అయితే నిందితుడు ఆర్‌జివి కోర్టు ఎదుట హాజరై బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని జడ్జీ చెప్పారు. వారెంట్ అమలు కోసం కేసును జూలై 28వ తేదీకి వాయిదా వేశారు.