Sunday, March 9, 2025

ప్రేమ గురించి ఒక కొత్త పాయింట్‌తో…

- Advertisement -
- Advertisement -

సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘దిల్ రూబా‘. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘దిల్ రూబా’ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్ రూబా‘ సినిమా ఈనెల 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. గురువారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రవి మాట్లాడుతూ – “దిల్ రూబా సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ అవుతుంది. 2019లో కిరణ్ నాకు ఈ కథ పంపించాడు. కథ బాగా నచ్చింది. హీరోయిన్స్ ఇద్దరూ మిమ్మల్ని కంటతడి పెట్టిస్తారు. వాళ్ల నటన అంత బాగుంటుంది. దర్శకుడు విశ్వకరుణ్ ఒక మంచి మూవీ చేశాడు”అని అన్నారు.

డైరెక్టర్ విశ్వకరుణ్ మాట్లాడుతూ “ప్రేమ గొప్పది కాదు అది ఇచ్చే వ్యక్తి గొప్పవాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాను. ఈ నెల 14న థియేటర్స్‌లోకి వస్తున్నాం. అందరికీ నచ్చేలా ఈ మూవీ ఉంటుంది”అని తెలిపారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – “ప్రేమ గురించి ఒక కొత్త పాయింట్ ఈ మూవీలో చెప్పాం. లవ్ బ్రేకప్ అయితే లవర్ నుంచి దూరంగా ఉంటాం. శత్రువులా చూస్తాం. కానీ ‘దిల్ రూబా’ చూశాక మీ అభిప్రాయం మారుతుంది. ఇందులో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి ఒక క్యూట్ ఎమోషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎక్స్ లవర్ ఉంటారు. మీకు వీలైతే ఈ సినిమాను మీ ఎక్స్ లవర్ తో చూడండి. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి ఫ్రెండ్‌షిప్ ఫీలింగ్‌తో వస్తారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు రుక్సర్ థిల్లాన్, క్యాతీ డేవిసన్, సుధీర్, డానియేల్ విశ్వాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News