- Advertisement -
చియాన్ విక్రమ్ హీరోగా ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ -ప్యాక్డ్ మూవీ వీర ధీర సూరన్ పార్ట్ 2. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్ వంటి అద్భుతమైన నటులు ఉన్నారు. హెచ్.ఆర్. పిక్చర్స్ రియా శిబు నిర్మించిన ’వీర ధీర సూరన్ పార్ట్ 2’ ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఈ చిత్రం మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగులో ఎన్విఆర్ సినిమాస్ ద్వారా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.
- Advertisement -