హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ మూవీ రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని రెండు పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. గురువారం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘ది హాటెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’గా సిజ్లింగ్ దివా కేతికా శర్మ నటించిన స్పెషల్ సాంగ్ మార్చి 10న విడుదల కానుంది. ఈ ట్రాక్‌లో కేతికా శర్మ అల్ట్రా గ్లామరస్ గా కనిపించనుంది. ఇది ప్రేక్షకులను, సంగీత ప్రియులను సర్‌ప్రైజ్ చేయబోతోంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ లో కేతిక శర్మ గ్లామరస్ లుక్ ఆకట్టుకుంది. బోల్డ్, స్టన్నింగ్ పర్ఫామెన్స్‌లతో ఆకట్టుకునే కేతిక శర్మ ఈ సాంగ్ లో అదరగొట్టబోతోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ బ్యుటీఫుల్ సినిమాటోగ్రఫీని అందించారు. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
స్పెషల్ సాంగ్ వచ్చేది అప్పుడే
- Advertisement -
- Advertisement -
- Advertisement -