- Advertisement -
హైదరాబాద్: నగరంలోని కెపిహెచ్‌బిలో గురువారం అర్థరాత్రి ఓ యువతులు బీభత్సం సృష్టించింది. కెపిహెచ్‌బి మెట్రో స్టేషన్ వద్ద మద్యం మత్తులో అతివేగంతో కారు నడిపి ఓ బైక్‌ను ఢీకొట్టారు. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అంతే కాక అతన్ని బెదిరించారు. దీంతో సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని ఆ యువతికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా.. రీడింగ్ 212 పాయింట్స్‌గా వచ్చింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారును జప్తు చేశారు.
- Advertisement -