Sunday, March 9, 2025

ప్రపంచస్థాయిలో టీచర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు: నారా లోకేష్

- Advertisement -
- Advertisement -

అమరావతి: పారదర్శకంగా టీచర్ల సీనియారిటీ జాబితా రూపకల్పన చేస్తున్నామని ఎపి మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా రూపొందిస్తున్నామని అన్నారు. శాసన సభలో లోకేష్ మాట్లాడారు. త్వరలోనే టీచర్ల బదిలీల చట్టం తీసుకొస్తామని, వచ్చే కేబినెట్ భేటీలో బదిలీల చట్టంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జివో 117పై అన్ని ఉపాధ్యాయ సంఘాలతోనూ చర్చించామని, వైసిపి ఉపాధ్యాయ సంఘాన్ని కూడా చర్చలకు పిలిచామని తెలియజేశారు. గత ప్రభుత్వం ఐబి, టోఫెల్, సిబిఎస్ఈ తెస్తామని ప్రకటించిందని, ఐబి, టోఫెల్, సిబిఎస్ఈపై ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడారని విమర్శించారు.

ఐబితో కాంట్రాక్టు కోసం రూ.5 కోట్లు ఖర్చు చేసి, సిబిఎస్ఈ అమలులో గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. టీచర్లను సిద్ధం చేయకుండానే సిబిఎస్ఈ అమలు చేశారని, విమర్శించారు. తొలి విడతలో 10 వేల స్కూళ్లలో వన్ క్లాస్- వన్ టీచర్ విధానం అమలు చేశాం. అమరావతిలో ప్రపంచస్థాయి టీచర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసి, నైతికత పెంపొందించేలా ప్రత్యేక పాఠ్యాంశాలుంటాయని నారా లోకేష్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News