Tuesday, April 8, 2025

అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేవలం మంత్రుల నియోజక వర్గాలకే నిధులు ఇస్తున్నారని తెలంగాణ బిజెఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. బిఆర్ఎస్ పాలనలో 3 నియోజక వర్గాలకే నిధులు వచ్చేవని చెప్పారు. ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. చనాఖా- కొరాట ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయటం లేదని ప్రశ్నించారు. చిన్న ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయటం లేదని, ఆదిలాబాద్ అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News