Tuesday, April 8, 2025

2050 నాటికి దేశంలో 44 కోట్ల మంది ఊబకాయులు:ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఊబకాయం సమస్యను మరొకసారి ప్రస్తావించారు. 2050 నాటికి 44 కోట్ల మంది భారతీయులు ఊబకాయులు అవుతారని నొక్కిచెప్పేందుకు ఒక నివేదికను ప్రధాని ఉటంకించారు. అది దిగ్భ్రాంతికర, ప్రమాదకర సంఖ్య అని మోడీ పేర్కొన్నారు. ఊబకాయం సమస్యను అధిగమించేందుకు వంట నూనె వాడకాన్ని పది శాతం మేర తగ్గించాలని మోడీ మళ్లీ పిలుపు ఇచ్చారు. సకాలంలో చర్య తీసుకోని పక్షంలో భవిష్యత్తులో భారీ స్థాయిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆయన హెచ్చరించారు. తీర ప్రాంత కేంద్రపాలిత ప్రాంతంలో పర్యటన సందర్భంగా దాద్రా, నగర్ హవేలి, దామన్, డయ్యూలో రూ. 2500 కోట్లు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన అనంతరం సిల్వాసాలో ఒక ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగించారు. సింగపూర్ ఒకప్పుడు కొద్ది మంది మత్సకారులు నివసించిన దీవి అని, కానీ, తన పౌరుల కఠిన శ్రమ కారణంగా స్వల్ప

కాలంలోనే అభివృద్ధి చెందిన దేశంగా మారిందని మోడీ సభికులతో చెబుతూ, దాద్రానగర్ హవేలి, దామనఖ డయ్యూ కూడా అదే విధంగా మారవచ్చునని సూచించారు. కేంద్రపాలిత ప్రాంత ప్రజలు ఆ మార్పు తీసుకురాగలరు. ఆ కృషిలో వారికి దన్నుగా నిలిచేందుకు నేను సిద్ధం’ అని మోడీ ప్రకటించారు. ‘దాద్రా నగర్ హవేలి, దామన్ డయ్యూ మనకు కేవలం కేంద్రపాలిత ప్రాంతంకాదు, కానీ మనకు గర్వకారణం, వారసత్వ సంపద. అది విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందింది’ అని ఆయన పేర్కొన్నారు. మోడీ ఒక నివేదిక గురించి ప్రస్తావిస్తూ , 2050 నాటికి 44 కోట్ల మంది భారతీయులు ఊబకాయులు అవుతారని, అది దిగ్భ్రాంతికరమని, ప్రమాదకరమని అన్నారు. ప్రతి మూడవ వ్యక్తి ఊబకాయం కారణంగా తీవ్ర రుగ్మతలతో బాధపడవచ్చునని ఆయన హెచ్చరించారు. ప్రజలకు సరసమైన ధరల్లో, నాణ్యమైన జనరిక్ మందులు సమకూర్చడానికి కేంద్రం దేశవ్యాప్తంగా 25 వేల జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయగలదని మోడీ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News