Tuesday, April 8, 2025

వన్డేలకు రోహిత్ గుడ్ బై?

- Advertisement -
- Advertisement -

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడనే వార్తలు జోరందుకున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ క్రికెటర్లు వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా స్టార్‌లు స్టీవ్ స్మిత్, స్టోయినిస్, బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ ముష్ఫికుర్ రహీం తదితరులు వన్డేలకు గుడ్‌బై చెప్పేశారు. తాజాగా రోహిత్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటాడని జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. గతంలో టి20 వరల్డ్‌కప్ ముగిసిన వెంటనే రోహిత్ పొట్టి క్రికెట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వన్డేల్లో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఫైనల్ తర్వాత రోహిత్ నిర్ణయం ఎలా ఉంటుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News