Tuesday, April 8, 2025

విజయమే లక్షంగా పెట్టుకున్నాం: కివీస్ కెప్టెన్ సాంట్నర్

- Advertisement -
- Advertisement -

దుబాయి: భారత్‌తో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో విజయమే లక్షంగా పెట్టుకున్నామని న్యూజిలాండ్ కెప్టెన్ మిఛెల్ సాంట్నర్ పేర్కొన్నాడు. తమతో పోల్చితే భారత్ మెరుగైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. అయితే టీమిండియాను ఓడించే సత్తా తమకుందన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తాము సమతూకంగా ఉన్నామన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లు తమకు అందుబాటులో ఉన్నారన్నాడు. సమష్టిగా రాణిస్తే ట్రోఫీని గెలుచుకోవడం తమకు కష్టం కాదన్నాడు. కానీ బలమైన భారత్‌ను ఓడించడం అనుకున్నంత తేలికేం కాదన్నాడు. దీనికి తోడు భారత్ తన మ్యాచ్‌లన్నీ దుబాయిలోనే ఆడడం వారికి కలిసి వచ్చే అంశమన్నాడు. ఫైనల్లో ఇది వారికి సహకరించినా ఆశ్చర్యం లేదన్నాడు. లాహోర్ పిచ్‌తో పోల్చితే దుబాయి కాస్త క్లిష్టమైన పిచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపాడు. పరిస్థితులు ఎలా ఉన్నా తాము మాత్రం విజయమే లక్షంగా బరిలోకి దిగుతామని సాంట్నర్ స్పష్టం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News