Tuesday, April 8, 2025

బారాత్‌లో మహిళ ప్రాణం తీసిన వరుడు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: పెళ్లి బారాత్‌లో పెళ్లి కుమారుడు కారు నడిపి ఓ మహిళ ప్రాణం తీసిన సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మానకొండూరు మండలం చెంజర్ల గ్రామానికి చెందిన జినుకల అశోక్, మెట్‌పల్లికి చెందిన బకారపు ప్రభాకర్ కూతురును పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి వేడుకలో భాగంగా కారు నడిపిస్తుండగా డ్రైవర్‌కు ఫోన్ రావడంతో కిందకు దిగాడు. అదే సమయంలో వరుడు కారు డ్రైవర్ సీట్లో కూర్చొని ముందుకు నడపాలని నిర్ణయం తీసుకున్నాడు. కారు ఒక్కసారిగా దూసుకెళ్లడంతో బకారపు ఉమ(35), ఆమె కుమార్తె నిఖితతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వాళ్లను ఆస్పత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం వారిని హుజూరాబాద్ ఏరియా, వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా ఉమ మార్గ మధ్యలో చనిపోయారు. ఎస్‌ఐ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News