- Advertisement -
జగిత్యాల: పెళ్లికి ముందు రోజు వరుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని రాంచంద్రపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లక్కంపెళ్లి కిరణ్(37) అనే యువకుడికి ఓ యువతి పెళ్లి సంబంధం పెద్దలు ఖరారు చేశారు. శుక్రవారం యువతి, యువకుడు ఫ్రీవెడ్డింట్ షూట్‌లో పాల్గొని ఇంటికి వచ్చాడు. రాత్రి ఇంట్లో తిని పడుకున్నాడు. శనివారం ఉదయం ఇంట్లో అతడు ఉరేసుకొని కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -