కోట్లాదిమంది తల్లుల ఆశీస్సులు నాకు ఉన్నాయి మహిళల
భద్రతకు మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం అత్యాచారం
వంటి నేరాలకు మరణశిక్ష పడేలా చట్టాలు సవరించాం
గుజరాత్ పర్యటనలో ప్రధాని మోడీ
మన తెలంగాణ/హైదరాబాద్: సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లలోనూ ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ప్రజాభవన్‌లో రెవెన్యూ రిసోర్స్ మొబైల్‌జేషన్ సబ్ కమిటీ సమావేశం భట్టి అధ్యక్షతన శనివారం జరగగా సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలకు ఉద్దేశించిన ఇసుక, మైన్స్ శాఖలను అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా వివరించారు. ఇసుకకు సంబంధించి ఐటీడీఏలతో త్వరగా ఒప్పందం చేసుకోవాలని మంత్రులు సూచించారు. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఆదాయం ఆర్జించే శాఖల్లో లోపాలు అరికట్టాలని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని అధికారులు సాధించాలని మంత్రులు సూచించారు.
2025-.26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకునే లక్ష్యాలు వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. హైదరాబాద్ నగరంలో కాలుష్య కారకమైన పరిశ్రమలను అవుటర్ రింగ్ రోడ్డు దాటించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వేగవంతంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్యాబినెట్ సబ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు ప్రతినెల ప్రగతిని సమీక్షించాలని ఆదేశించారు. ఆ ప్రగతి వివరాలను ప్రతి మూడు నెలలకు క్యాబినెట్ సబ్ కమిటీకి వివరించాలని కూడా ఆదేశించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఈ నేపథ్యంలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను విస్తృతంగా అన్వేషించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి, మంత్రుల వద్ద ఉన్న ప్రధాన అంశాలకు సంబంధించిన విషయాలపై శ్రద్ధ పెట్టి ఉన్నతాధికారులు
ఫాలోఅప్ చేసుకోవాలని, వాటిని క్యాబినెట్ ముందుకు తీసుకొచ్చేందుకు చొరవ చూపాలని కోరారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, మై న్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్‌ఎంఏ రిజ్వి, ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సురేంద్రమోహన్, రిజిస్ట్రేషన్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఇండస్ట్రీస్ కమిషనర్ విష్ణువర్ధన్, హౌసింగ్ ఎండి గౌతం, కమర్షియల్ టాక్స్ కమిషనర్ హరిత తదితరులు పాల్గొన్నారు.