రాయ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ తెరకెక్కించిన చిత్రం ‘కర్మ స్థలం’. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అర్చన (వేద), మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కాలకేయ ప్రభాకర్, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను హీరో ఆకాష్ పూరి రిలీజ్ చేశారు. ముఖ్య అతిధులుగా ఆకాష్ పూరితో పాటు మరో హీరో విజయ్ శంకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాష్ పూరి మాట్లాడుతూ “నేను కూడా అమ్మవారి భక్తుడిని. ఇలా అమ్మవారి గురించి సినిమా రావడం చాలా బాగుంది. నేను కర్మని నమ్ముతాను. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది అలానే చెడు చేస్తే చెడు జరుగుతుంది అని నమ్ముతాను”అని అన్నారు. డైరెక్టర్ రాకీ మాట్లాడుతూ “మనం సాధారణంగా ఎలాంటి పండగ వచ్చిన ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దాని వెనకాల ఒక హిస్టరీ, వార్ ఇలా చాలా వున్నాయి. ఇందులో ఒక మంచి లైన్ చెప్పాను… అదే మహిసాసుర మర్ధిని”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మిథాలీ చౌహాన్, ప్రొడ్యూసర్ యువరాజ్, సతీష్ సరిపల్లి, క్రాంతి కిల్లి తదితరులు పాల్గొన్నారు.
‘కర్మ స్థలం’ లాంటి కథ చేయాలని ఉంది: ఆకాష్ పూరి
- Advertisement -
- Advertisement -
- Advertisement -