- Advertisement -
ఎస్ ఎల్ బి సి లో సొరంగం కూలిన ఘటనలో మృతి చెందిన గురు ప్రీత్ సింగ్ మృతదేహాన్ని గుర్తించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మృతుడి భార్య రాజ్విందర్ కౌర్ పేరు మీద 25 లక్షల రూపాయల చెక్కును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించడానికి మృతదేహంతో పాటు వెళుతున్న రెవెన్యూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ చెక్కును అందించారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన గురు ప్రీత్ సింగ్ స్వగ్రామానికి తరలించడానికి అధునాతన మైన రెఫ్రిజిరేటర్ కలిగిన అంబులెన్స్ ద్వారా ఏర్పాటు చేశారు. రాత్రి 11 గంటల వరకు ఫార్మాలిటీస్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. పోస్టుమార్టం తో పాటు ఫోరెన్సిక్ నిపుణులు డిఎన్ఏ నమూనాలను సేకరించారు. జిల్లా వైద్య శాఖ అధికారులు, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో పోస్టుమార్టంతో పాటు ఫార్మాలిటీస్ పూర్తి చేశారు.
- Advertisement -