Monday, March 10, 2025

చిన్ననాటి స్నేహితుడితో నిశ్చితార్థం

- Advertisement -
- Advertisement -

బ్లాక్ బస్టర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శంభో శివ శంభో చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న నటి అభినయ. సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకీ మామ హీరోలుగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా తాజాగా మళ్ళీ విడుదలై హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో మంచి పాత్ర చేసిన ప్రముఖ నటి అభినయ ఓ గుడ్ న్యూస్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది.

తాను పెళ్లికి సిద్ధం అయ్యినట్టుగా తన ఎంగేజ్‌మెంట్ పిక్‌ని షేర్ చేసుకున్నారు. తనకి కాబోయే భర్తతో కలిసి గుడిలో గంట కొడుతూ తాము ఒకటి కాబోతున్నట్టుగా తెలియజేశారు. అయితే ఈమె ఎవరిని పెళ్లాడనున్నారు అనేది మాత్రం చెప్పలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అభినయ మాట్లాడుతూ ‘నా చిన్ననాటి స్నేహితుడితో రిలేషన్‌లో ఉన్నాను. మాది 15 ఏళ్ల బంధం’ అని పేర్కొన్నారు. ఇక సినీ ప్రముఖులు, ఫాలోవర్స్ ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News