Monday, March 10, 2025

శంషాబాద్ లో విమానానికి తప్పిన పెను ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో గోవా నుంచి వచ్చిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం….. ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన 6ఇ6973 విమానం 150 మంది ప్రయాణికులతో గోవా నుంచి విశాఖపట్నం వెళ్తోంది. శంషాబాద్ నుంచి వెళ్తుండగా ఎటిసి అధికారులు ల్యాండింగ్ కు అవకాశం ఇచ్చారు.  ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో ఎటిసి అధికారులు హైడ్రాలిక్ గేర్ ను సిద్ధం చేశారు.

ల్యాండింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మరో విమానం టేకాఫ్ అవుతుండడం గమనించి వెంటనే రివర్స్ టేకాఫ్ తీసుకున్నాడు. విమానం గాల్లోకి లేవడంతో పెను ప్రమాదం తప్పింది. గాల్లో పది నిమిషాలు పాటు విమానం చక్కర్లు కొట్టిన అనంతరం విమానం సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపటికి విమానం విశాఖపట్నం వెళ్లిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News