- Advertisement -
హైదరాబాద్: 2013లో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు కుర్రాళ్లు ఉన్నారు. ఆ చాంఫియన్స్ ట్రోఫీలో కుర్రాళ్లుగా రాణించారు. ప్రస్తుతం ఛాంపియన్ ట్రోఫీలో సీనియర్లు జట్టు విజయపల్లకి మోశారు. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. పాకిస్టాన్, ఆస్ట్రేలియా వంటి జట్లపై విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. జడేజా తన స్పిన్ మాయజాలంతో కట్టిపట్టేశాడు. త్రిమూర్తులుగా నిలబడి జట్టును విజయపథంలో నడిపించారు.
- Advertisement -