- Advertisement -
అమరావతి: ఎమ్మెల్సీలుగా బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామని ఎపి మంత్రి నారా లోకేష్ తెలిపారు. బలహీన వర్గాలపై టిడిపికి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటామని అన్నారు. మీడియా ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ సమావేశం జరిపారు. యువ మహిళలను ప్రోత్సహించాలని గ్రీష్మకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చామని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికి పదవులు వస్తాయని తెలియజేశారు. పదవులు రాలేదని ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. టీచర్ల సమస్యలను క్రమపద్ధతిలో పరిష్కరించామని నారా లోకేష్ పేర్కొన్నారు.
- Advertisement -