దుబాయ్: 2025 ఛాంచపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీని మూడు సార్లు అందుకున్న తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. అంతేకాక.. వరుసగా రెండు ఐసిసి ట్రోఫీలను భారత్ అందించిన కెప్టెన్‌గా రోహిత్ కూడా రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే ఈ మ్యాచ్ విజయం తర్వాత ఓ ప్లేయర్‌పై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. అతనే శ్రేయస్ అయ్యర్.
ఈ టోర్నమెంట్‌లో శ్రేయస్ ఆడిన ప్రతీ మ్యాచ్‌లో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నమెంట్‌లో ఐదు ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ 243 పరుగులు చశాడు. ఈ సందర్భంగా శ్రేయస్‌ను సైలెంట్ కిల్లర్‌గా అభివర్ణించాడు. రోహిత్ శర్మ. ‘శ్రేయస్ మాకు దొరికిన సైలెంట్ హీరో. మిడిలార్డర్‌లో అతను చాలా కీలకమైన ఆటగాడు. నేను ఔట్ అయ్యాకు అక్షర్‌తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని జత చేశాడు. అది జరగకపోయి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. అతను ఒత్తిడిలో కూడా అద్భతంగా ఆడుతాడని’ రోహిత్ పేర్కొన్నాడు.