Monday, March 10, 2025

మూసీకి నిధులు తెస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తా : రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ భయపెడతారనే ప్రభుత్వానికి బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహకరించడంలేదని సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మనోహర్ లాల్ ఖట్టర్ వచ్చేది కూడా కిషన్ రెడ్డికి తెలియదా? అని ప్రశ్నించారు. ఆర్ఆర్ఆర్ ఇచ్చామని మోదీ అన్నారని, అదే ఇవ్వమంటున్నామని రేవంత్ అన్నారు. ‘‘జైపాల్ రెడ్డి తెచ్చిన మెట్రో కనిపిస్తోంది…కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడ?’’ అని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు ముందుకెళ్లకుండా అడ్డుకుంటోంది బిజెపి ఎంపిలేనని మండిపడ్డారు. మూసీకి నిధులు తెస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తానని రేవంత్ ఎద్దేవా చేశారు. అఖిలపక్ష సమావేశానికి పిలిస్తే కిషన్ రెడ్డి రాలేదని ఆరోపించారు. 39 సార్లు కాదు.. 99 సార్లు ఢిల్లీకి వెళ్తానని, వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి కావాల్సినవి తెచ్చుకుంటానని తెలిపారు. తెలంగాణకు కావాల్సిన అనేక అంశాలను క్లియర్ చేసుకుని వచ్చానని, కులగణన ప్రభావం వల్లే అన్ని పార్టీలు బిసిలకు టికెట్లు ఇచ్చాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News