Tuesday, March 11, 2025

కస్టడీలో మాటలతో వేధించారు:నటి రన్యా రావు

- Advertisement -
- Advertisement -

దాదాపు 14.56 కోట్ల రూపాయల విలువైన బంగారు కడ్డీలను స్మగ్లింగ్ చేస్తూ పట్టుపడిన కన్నడ నటి రన్యారావును బెంగళూరు ప్రత్యేక కోర్టులో హాజరుపరచారు. ఆ సందర్భంగా రెవిన్యూ ఇంటెలిజెన్స్ కస్టడీలో తనను మాటలతో హింసించారని, బెదిరించారని ఆరోపించారు. తాను ఎంతో బాధ పడ్డానని, మానసికంగా కుంగిపోయానని ఆమె వివరించారు. ఆమెను భౌతికంగా ఏమైనా టార్చర్ చేశారా అని కోర్టు ప్రశ్నించినప్పుడు కంటతడి పెట్టుకుని తన గోడు చెప్పుకున్నారు. బౌతికంగా ఎలాంటి దాడి జరగలేదని తెలిపారు. ఈ ఆరోపణలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెజిజెన్స్ (డిఆర్ ఐ) ఖండించింది. రన్యారావును అరెస్ట్ చేసినప్పటి నుంచీ కస్టడీలో ప్రశ్నించిన అన్ని సందర్భాలు సిసిటీవి కెమెరాలలో రికార్డు అయ్యాయని డిఆర్‌ఐ పేర్కొంది. అరెస్ట్ సమయంలోనో లేదా, ఇంటరాగేషన్ సమయంలో రన్యారావుపై దాడి చేసి ఉంటారనే ఊహాగానాలు చక్కర్లు చేస్తున్న నేపథ్యంలో కోర్టు ఆమెను ప్రశ్నించింది.

మీడియాలో ఆమె కళ్లు ఉబ్బి, ముఖంపై గాయమైన ఫోటో కన్పించడం ఓ కారణం. నటి రన్యారావు ను మార్చి 24 వరకూ జుడీషియల్ కస్టడీకి పంపుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం నాడు ఆమె బెయిల్ దరఖాస్తుపై విచారణ జరగాల్సి ఉంది. రన్యారావు సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్ర రావు సవతికూతురు. మార్చి 3న ఆమె దుబాయ్ నుంచి బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు వచ్చినప్పుడు ఆమె దాదాపు 14 కోట్ల 56 లక్షల విలువైన 14.2 కిలోల బంగారు కడ్డీలను స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఆమె తోపాటు, ఈ కేసులో మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వారిలో టీ రాజ్ అనే వ్యక్తి ఆమెతో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి కాగా, మరో వ్యక్తి తరుణ్ కొండరాజు దుబాయిలో ఆమెతో ఉన్న ఆమె ఫ్రండ్ అని పోలీసులు తెలిపారు..కాగా, ఆమె స్మగ్లింగ్ తో తనకు సంబంధం లేదని ఆమె సవతి తండ్రి సీనియర్ పోలీసు అధికారి రామచంద్రరావు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News