సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ సేవలు హటాత్ గా వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోయాయి. డౌన్ అయినట్లు తెలిసింది. ఎక్స్- డౌన్ డిటెక్టర్ చూపిస్తోంది. అమెరికాలో ఏకంగా 21 వేల మంది వినియోగదారులు, బ్రిటన్ లో 10, 800 మంది వినియోగదారులు ఎక్స్ తెరుచుకోక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇబ్బంది పడ్డారు. ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అనేక ప్రాంతాలనుంచి పరిస్థితి తెలుసుకుని, ఏమేరకు అంతరాయం ఏర్పడిందో ట్రాక్ చేసి నివేదిక అందించే డౌన్ డిటెక్టర్ ప్రకారం అమెరికాలో ప్లాట్ ఫామ్ లో 21 వేల కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని, బ్రిటన్ లో 10,800 పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇంకా చాలా ప్రదేశాలలో కూడా ఎక్స్ సేవలకు అంతరాయం కల్గిందని తెలిసింది. అయితే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్.. ఎక్స్ మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.ఆదివారం సాయంత్రం నుంచి. మంగళవారం సాయంత్రం వరకూ ఎక్స్ వినియోగదారుల సమస్యలు పరిష్కారం కాలేదని తెలిసింది.
స్తంభించిన సోషల్ మీడియా ఎక్స్ సేవలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -