Tuesday, March 11, 2025

భారత్ విజయంతో ఘర్షణలు.. 13 మంది అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఇండోర్: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం సాధించడంతో జరిగిన సంబురాలు మధ్యప్రదేశ్‌ మ్హౌ(డా.అంబేద్కర్ నగర్‌)లో మతఘర్షణలకు దారి తీశాయి. ఇండోర్ ‌నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం చెలరేగిన అల్లర్లలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీ ఛార్జీ చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో బాష్పవాయువును ప్రయోగించారు. ఈ ఘటనలో పోలీసులు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. భారత్ మ్యాచ్ గెలిచిన ఆనందంలో కొందరు యువకులు సంబరాలు చేస్తూ.. ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీ జమా మసీద్ వద్దకు చేరడంతో అక్కడ ఉన్న వాళ్లు బైక్‌లను ఆపేయాలని, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని అన్నారు. ఇలా మాటామాట పెరగడంతో యువకులపై రాళ్లు విసరడం.. యువకులు ప్రతిదాడి చేయడం జరిగింది. ఇలా ఈ గొడవ జమా మసీద్ వద్ద ప్రారంభమై.. మనేక్ చౌక్, సేవ మార్గ్, మార్కెట్ చౌక్, రాజేశ్ మోహలియా వరకూ కొనసాగింది. ఈ ఘర్షణలో కొందరు వ్యక్తులు ద్విచక్రవాహనాలకు నిప్పంటించారు.

దీనిపై ఇండోర్ కలెక్టర్ అశిష్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘రెండు వాహనాలకు నిప్పంటించారు. ఎంతమందికి గాయాలయ్యాయో ఇప్పుడే మాకు తెలియదు’’ అని పేర్కొన్నారు. ఈ ఘర్షణను అదుపులోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించామని.. అదనపు బలగాలను కూడా పిలిపిస్తున్నామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News